ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్ మంత్రి
ఒంగోలులోని కలెక్టరేట్ లో ఇన్ ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అన్సారియా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.