అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ లో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం అన్ని మండల కేంద్రాలలో కూడా మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తారన్నారు.