విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొనకలమిట్ల మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకట్రావుగా పోలీసులు గుర్తించారు. మృతుడు మార్కాపురం పట్టణంలోని నిర్మిస్తున్న బిల్డింగ్ లో పనులు చేస్తుండగా విద్యుత్ తీగల తగిలి మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మార్కాపురం ఎస్సై తెలిపారు.