బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం సమయంలో కందుకూరు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. అతి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రైతులు సాగు చేస్తున్న పొగాకు, మిర్చి వర్షాల కారణంగా దెబ్బతినడంతో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.