బాపట్ల జిల్లాలో మద్యం షాపులకు యామ గిరాకి
మద్యం నూతన పాలసీ ప్రక్రియను జిల్లాలో పారదర్శకంగా అమలు చేస్తామని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. చీరాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీడియాతో మాట్లాడుతూ బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల, బాపట్ల, పర్చూరు, అద్దంకి, నగరం, రేపల్లె, వేమూరు ఏడు సర్కిల్ లలో ప్రభుత్వం కేటాయించిన 117 షాపులకు ఇప్పటికి 1350కి పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.