ఇంకొల్లులోని వెలుగు శాఖ కార్యాలయం నందు బుధవారం వివోఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపిఎం అనురాధ పాల్గొని మాట్లాడారు. స్త్రీ నిధి రుణాల బకాయిలను త్వరగా రికవరీ చేయాలని ఆమె వివోఏలకు సూచించారు. డ్వాక్రా సంఘాలు బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని ఆమె తెలియజేశారు.