కృత్రిమ శ్వాస యంత్రం అందజేసిన ఎమ్మెల్యే మాధవి

74பார்த்தது
కృత్రిమ శ్వాస యంత్రం అందజేసిన ఎమ్మెల్యే మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి చొరవతో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వెంకటేశ్ కు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటెన్నియల్ సి -పాప్ కృత్రిమ శ్వాస యంత్రం గురువారం అందజేశారు. గుంటూరు శ్రీనివాసరావుతోటలో నివాసం ఉంటున్న యర్రబోతు వెంకటేశ్ కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. సామాజిక సేవా దృక్పథంతో ఆదుకోవాలని మాధవి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యంత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி