గుంటూరు: పెట్టుబడిదారుల మేలు కోసమే జమిలి ఎన్నికలు
పెట్టుబడిదారులకు మేలు చేసేందుకు ప్రధాని మోదీ జమిలి ఎన్నికల నినాదాన్ని తెరపైకి తెచ్చారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సమకాలీన రాజకీయ పరిణామాలపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు హేతుబద్ధత లేని సాకులను మోదీ ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.