ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన గుంటూరు పోలీసులు

52பார்த்தது
ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన గుంటూరు పోలీసులు
ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ, ఇద్దరు పిల్లలను గుంటూరు పోలీసులు శుక్రవారం కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీనివాసరావు పేటకు చెందిన భార్యాభర్తలు హసీనా, సుభాని మధ్య గొడవ జరిగింది. భార్య హసీనా మనస్తాపానికి గురై తన పిల్లలతో సహా చనిపోవాలని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళింది. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ నగరంపాలెం పోలీసులను సకాలంలో పంపించి తల్లీపిల్లలను కాపాడారు.

தொடர்புடைய செய்தி