తరచూ వివాదాల్లో నిలిచే ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు యువతులు జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టంట వైరల్ అవుతోంది. ఒకరిని ఒకరు తన్నుకునేంతవరకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో గానీ కూర్చున్న ఒక యువతి మరో యువతిపై దాడి చేసింది. దీంతో ఇద్దరూ పిచ్చెక్కినట్టు కొట్టుకున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు సాధారణమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.