యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు సాధారణ భక్తులు, రాజకీయ నేతలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు.ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన WWE స్టార్ ఫైటర్ 'ది గ్రేట్ ఖలీ' మహా కుంభమేళాలో పాల్గొన్నారు. తోటి భక్తులతో కలిసి పుణ్య స్నానం ఆచరించారు. ఖలీ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.