రాబోయే సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. అది మన దేశంలో కనిపించదు. ఇది అమెరికా, పశ్చిమ యూరప్ & ఆఫ్రికాలో కనిపిస్తుంది. మార్చి 29న ఏర్పడే పాక్షిక సూర్య గ్రహణం కూడా స్వదేశంలో కనిపించదు. Sep 7-8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం మాత్రమే భారత్‌లో కనిపిస్తుంది. సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం మనకు ఉండదు.