ఐనవోలు: పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి మృత్యువాత పడ్డారు. మృతుల్లో దౌతు బాజీ శ్రావణి, కుకట్ల రాజు, తమ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా వర్షం పడుతుండటంతో పక్కనే ఉన్న పశువుల కొట్టు కిందకు వెళ్తున్న సమయంలో పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంతలో పక్కనే ఉన్న మరో 10 మంది కూలీలు గమనించి దగ్గరికెళ్ళి చూడడంతో ఇద్దరు మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.