తెలంగాణ రాష్ట్ర ఫ్యామిలీ డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య చేతులమీదుగా గురువారం ప్రారంభించారు. పర్వతగిరి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో పలు గ్రామాల రోడ్ల పనులకు మంత్రి సీతక్క చే శంకుస్థాపన చేయించారు. వన మహోత్సవంలో భాగంగా చెట్లను నాటి అనంతరం ఫ్యాక్స్ నూతన భవనము, 500మెట్రిక్ టన్నుల గోదాముల శంకుస్థాపన చేశారు.