వరంగల్ ఎస్ఆర్ నగర్ లో శనివారం అర్ధరాత్రి ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడినట్లు ఎనుమాముల సీఐ రాఘవేందర్ ఆదివారం తెలిపారు. మంచాల అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అతడి స్నేహితులు ఇంటికి వచ్చారు. అదే ఏరియాకు చెందిన జీవన్, వినయ్, కల్యాణ్ కు సంబంధించిన బైక్లు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయి. అర్జున్ స్నేహితులు వారిపై దాడి చేశారు. అనంతరం అర్జున్ ఇంటిపై కర్రలతో దాడికి దిగి ఇంటి తలుపులు, కిటికీలను ధ్వంసం చేశారు.