జాబ్ మేళా నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఉదయం 9. 30 గంటల నుండి నిర్వహించనున్న జాబ్ మేళాను విజయవంతం చేయడానికి బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో కమిషనర్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.