సార్వత్రిక విద్య ఎంతో సులభమైనదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఓపెన్ స్కూల్ ప్రాధాన్యత పై అవగాహనలో భాగంగా శనివారం తన నివాసంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్, బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ శంకర్ రావు తదితరులు పాల్గోన్నారు.