పిడుగుపడి ఇద్దరు మహిళ కూలీలు మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో ఇద్దరు మహిళ కూలీలు మృతి చెందారు. చౌల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ఇటకాల నిర్మల, సోలంక రమ వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా కల్లు మండువ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల, రమ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.