రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పరకాల బస్టాండ్ కూడలి నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు.