ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ పరిధి పాఠశాలలకు నేడు అధికారికంగా సెలవు ప్రకటించారు. ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పెద్దల (కొత్తల) పండుగ సందర్భంగా మంగళవారం మంత్రి సీతక్కను కలిసి ఆదివాసీ నాయకులు సెలవు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. దీంతో ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.