తాడ్వాయి మండలం మేడారంలో పొట్ట పండుగ వైభవంగా గురువారంతో ముగిసిందని పూజారులు తెలిపారు. సమ్మక్క గుడిని శుద్ధిచేసి, ఆడపడుచులు గుడిలో ముగ్గులువేసి అలంకరించారు. రాత్రి సమ్మక్క గుడి నుండి పసుపు, కుంకుమ, పూజసామగ్రి తీసుకొని పూజారులు, వడ్డెలు డోలువాయిద్యాలతో అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో శుభం కలగాలని కొంతమంది వరంపట్టగా పూజారులు వారిపై నుంచి దాటుకుంటూ వెళ్లారు. అనంతరం రహస్య పూజలు నిర్వహించారు.