ములుగు జిల్లాలోని ఇంచర్ల గట్టమ్మ వద్ద ఉదృక్తత నెలకొంది. బుధవారం రెవిన్యూ అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్ ప్రభుత్వం 39 మంది రైతులకు పట్టాలు జారీ చేయడంతో సాగు చేసుకుంటున్నారు. వారి భూములను జెసీబిలతో కందకాలు తవ్వి స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన రెవిన్యూ అధికారులను, జేసీబిలను భూములు తవ్వకుండా రైతులు అడ్డుకున్నారు. అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.