ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో బుధవారం రాత్రి రైతులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ. రైతన్నల పక్షాన ఎప్పటికీ నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతు రుణమాఫీతో స్పష్టమైందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.