బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపి మాలోత్ కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన తెలిపారు. రుణ మాఫీ పథకం తో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని, రైతులకు 2లక్షల రుణ మాఫీ పథకం వర్తింపచేయటాలంటూ నినాదాలు చేశారు.