మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆదివారం ఆకతాయిలు హల్చల్ చేశారు. విద్యార్థినిల పట్ల ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించారని విద్యార్ధులు తెలిపారు. విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు పట్టించుకోలేదని తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు డిమాండ్ చేశారు.