ఎన్నికల సమయంలో అధికారం కోసం 420 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఈ నెల 4న పాలకుర్తి నియోజకవర్గం తొర్రురు మండల కేంద్రంలో రైతు రుణమాఫీ కోసం చేపట్టనున్న ధర్నా కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.