మరిపెడ: క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయాలి: డా.గుగులోత్ రవి

73பார்த்தது
మరిపెడ: క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయాలి: డా.గుగులోత్ రవి
పుట్టిన పిల్లల నుండి 16 సంవత్సరాల వరకు గల పిల్లలకు మరియు ప్రతి గర్భిణీ స్త్రీలకు తప్పనిసరిగా క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయాలని స్థానిక పి హెచ్ సి వైద్యాధికారి డా. గుగులోత్ రవి నాయక్ అన్నారు. గిరిపురం గ్రామంలో జరుగుతున్న సమగ్ర వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఈ వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి బుధవారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி