గోదావరి తీర ప్రాంతాల్లో నేల స్వభావం, నీటి లభ్యత, తదితర అంశాలపై సర్వే చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఖనిజాల అన్వేషణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎడపల్లిలో జియాలాజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో లోతులో డ్రిల్లింగ్ చేసి నేల మట్టిని తీసుకుంటున్నారు. నేలల స్వభావం ఏ విధంగా ఉంది. నీటి లభ్యత, ఖనిజాలు, నిక్షేపాలు, చమురు, తదితర వాటికోసం పరీక్షిస్తున్నారు.