బీజేపీ సభ్యత్వ నమోదు 2024ను విజయవంతం చేయాలని.. జిల్లా సభ్యత్వ ప్రముఖ్ జన్నె మొగిలి కోరారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి రూరల్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ.. నియోజవర్గంలోని 320 బూతులలో బూతుకు 200 చొప్పున సభ్యత్వ నమోదు ప్రక్రియను చేయించాలని కార్యకర్తలను సూచించారు.