మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

81பார்த்தது
భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ కారే ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు గంజాయి, మత్తు పదార్థాల అనర్థాలపై జిల్లా పరిధిలోని కళాశాల, పాఠశాల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే మత్తు పదార్థాల బారినుంచి కాపాడవచ్చన్నారు. మత్తు పదార్థాల వినియోగం సామాజిక సమస్యగా పరిగణించబడుతోందని, ఈ సమస్యను రూపుమాపాలని పోలీసులు పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி