భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న వేషధారణలో ప్లాస్టిక్ బాటిల్లను ధరించి ఎలుగుబంటి వేషధారణలో గారేపల్లిలోని షాపుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ నిరోధించాలంటూ మంగళవారం ప్రచారం చేశారు. ప్లాస్టిక్ కవర్లలో నిల్వఉంచిన పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ లాంటి అనేక ప్రాణాంతక రోగాలు వస్తాయని, పేపర్ బ్యాగులు లేదా క్లాత్ బ్యాగులను వాడాలని గ్రామపంచాయతీ కార్యదర్శి శగీర్ ఖాన్ అవగాహన కల్పించారు.