TG: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో తమకు అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేసి తీసుకువెళ్లారు. కుటుంబ సమేతంగా నగరం నలు మూలల నుంచి ప్రజలు ఎగ్జిబిషన్ చూసేందుకు వస్తున్నారు. సాయంత్రం వేళ ఎగ్జిబిషన్ మైదానం చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లన్నీ సందర్శకులతో రద్దీగా కనిపించాయి.