వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చల్లాపూర్ లో చిరుత లేగదూడపై దాడిచేసి చంపిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలుముల సాయప్ప రోజులాగే తన పొలం దగ్గర పశువులను కట్టేసి రాగా. చిరుతలు లేగదూడను లాక్కెళ్ళి చంపేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. కాగా ఇటీవలే మద్దూర్ మండలం నందిపాడులో పశువులపై చిరుతల దాడి చేశాయి.