భూమిపై నుంచి నిట్టనిలువుగా టేకాఫ్ అయి అలాగే భూమి మీదకు దిగే సామర్థ్యం(VTOL) కల విమానాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బ్లూజే ఏరో స్పేస్ ఆవిష్కరించింది. మానవ రహిత సరుకు రవాణా విమానమైన దాన్ని నాదర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షించారు. పూర్తిస్థాయిలో 2026 నాటికి ఈ విమానాన్ని సిద్ధం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. 100 కిలోల బరువును 300 కి.మీ.ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఈ విమానానికి ఉంటుందని పేర్కొంది.