షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పండుగ అని ఎంపీ డీకే అరుణ అన్నారు. సింగపూర్ లో సాంస్కృతిక కళాసారధి సింగపూర్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయలే భావి తరాలకు ఇచ్చే ఆస్తులని చెప్పారు. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న వేళ మన భాష గొప్పతనం చాటేలా ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం సంతోషకరమన్నారు.14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్‌లో వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.