TG: కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో కంటతడి పెట్టించే ఘటన చోటుచేసుకుంది. గురువారం తండ్రి సత్యం చనిపోయాడు. సత్యం కూతురు కీర్తన పదో తరగతి పరీక్షలు రాస్తోంది. తండ్రి చనిపోయినా ఆ బాధను గుండెల్లో దాచుకుని పదో తరగతి పరీక్షలకు హాజరై పరీక్ష రాసింది. దీంతో కీర్తనను స్నేహితులు ఓదార్చారు. ఈ ఘటన కొంతమందిని కంటతడి పెట్టించింది.