తెలంగాణలో నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్లపై TGPSC కీలక ప్రకటన చేసింది. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్-1 హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. జూన్ 9 ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది.