కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని సూర్యాపేట 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ గండూరి కృపాకర్ అన్నారు. గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ నందు నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. మొత్తం మూడు విడుతలుగా నిర్వహించిన ఈ శిక్షణలో 120మంది మహిళలు శిక్షణ పొందారన్నారు.