కోదాడ పట్టణంలో బతుకమ్మ సంబురాలకు వర్షం అడ్డంకి గా మారింది. ఉదయం నుండి ఉక్కగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి పోయింది. గాలి దూమారం తో మొదలై, ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. బతుకమ్మలు సిద్ధం చేసుకొని ఆట పాటకు సిద్దమవుతున్న సమయంలో వర్షం మొదలవ్వడంతో మహిళలు నిరుత్సాహనికి గురయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.