విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరం: హరీశ్ రావు

52பார்த்தது
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ (M) నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 83 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే కూడా కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ మరణం మరొక ఉదాహరణ అని ట్వీట్ చేశారు. చనిపోయిన విద్యార్థి నిఖిల్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி