వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ

61பார்த்தது
వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం రాత్రి సద్దుల బతుకమ్మ పండగ ఘనంగా జరిగింది. మహిళలందరూ తీరొక్క పుష్పాలతో అత్యంత శోభాయమానంగా, సుందరంగా బతుకమ్మను పేర్చి భక్తి శ్రద్ధలతో ఆడి పాడి సందడి చేశారు. వేములవాడ పట్టణం బతుకమ్మ పాటలతో మారుమోగింది. ఎటు చూసినా రంగురంగుల దుస్తులతో పాటు తీరొక్క పుష్పాలతో అలంకరించారు. ఎక్కడ లేని విధంగా సద్దుల బతుకమ్మ ఏడు రోజుల్లోనే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி