
సిరిసిల్ల: బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కలెక్టర్
రాష్ట్ర బీసీ కమిషన్ బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ జిల్లా పర్యటనకు రాగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం కమిషన్ చైర్మన్, సభ్యులు సిరిసిల్ల, వేములవాడలో పర్యటించనున్న సందర్భంగా వారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గెస్ట్ హౌస్ కు చేరుకోగా, కలెక్టర్ వారికి పుష్పగుచ్చం అందజేశారు.