ఇండో అమెరికన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అమెజాన్ ఫుచర్ ఇంజనీర్ వారి నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన జమ్మికుంట ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థిని సనా ఖాన్ ను యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడు సజ్జాద్ మొహమ్మద్, జోరుక సాయిలు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాల నుండి ఎన్నికైన 80 మంది విద్యార్థుల్లో సనా ఒక విద్యార్థిని.