

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కళ్యాణానికి సర్వం సిద్ధం
ఇల్లందకుంటలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణ వేదిక సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మండపానికి తీసుకురానున్నారు. 11: 30 గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.