పెగడపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో మండల వ్యవసాయ అధికారిగా శ్రీకాంత్ గురువారం నూతనంగా బాధ్యతలు స్వీకరించినారు. ఇటీవల నిర్వహించిన ఏఓ పరీక్షలలో విజయం సాధించి, మండల వ్యవసాయ అధికారిగా నియామకమైన ఓరుగంటి శ్రీకాంత్ బాధ్యతలు స్వేకరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మండల రైతులకు విశేష సేవలందిస్తానని తెలిపారు. వారికి ఏఈవోలు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.