సిద్ధిపేట: ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి
కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని అఖిల భారత కుంభార్ ప్రజాపతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణంలో రాష్ట్ర స్థాయి కుమ్మరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుమ్మరులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమ్మరులకు టికెట్లు కేటాయించాలన్నారు.