బైకును ఢీకొట్టిన ట్రక్కు.. హల్చల్ చేసిన మహిళ (వీడియో)

51பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. బైకుపై వెళుతున్న భార్యాభర్తలను ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధిత మహిళ ట్రక్కు పైకి ఎక్కి డ్రైవరుతో తీవ్ర ఘర్షణకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని ట్రక్కు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி