ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ సంజీవరెడ్డి అన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లపూర్ 2వ వార్డుకు చెందిన రాజయ్యకు మంజూరైన రూ. 60వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి, నర్సింహులు, రాజు, దుర్గయ్య, మల్లయ్య, పోచయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.