గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బోర్సరన్ గ్రామ శివారులో 16 ఏళ్ళ బాలిక(సాగిరా)పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాగిరా అనే బాలిక తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి.. బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం DOG స్క్వాడ్ సహాయం తీసుకున్నారు.