మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బక్కి వెంకటయ్య
ఇటీవల మరణించిన మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ చైర్మన్ ఎన్నం మల్లారెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. సర్పంచ్ గా, సొసైటీ చైర్మన్ గా ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరితో చనువుగా మెదిలే వారన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.